Friday, August 29, 2014

Set up & Inciting Incident : Illustration # 1 - LEADER

Set up and inciting incident, which occupy the first 20-30 min of movie time are the most crucialaspects of any film because these two tell, what the story is about and where it is heading to.
This article could be more understanding for those who know the technical terms of screenplay writing but I also hope the below brief explanations would help general audience as well in knowing those terms.
Three-Act Structure - is the mostly used form of screenplay writing. (I would like to reiterate what most of the famous screenplay writers say and believe, three-act structure is a form but not formula for screenplay writing)
In simple terms, Three Act Structure means the screenplay is divided into three acts:
Act 1 (Set up) – which gives information of what the story is about and what Protagonist’s goal and about the other major characters in the story.
Inciting incident – What makes Protagonist to take up the goal or the first twist in the story.
Act 2 – The journey towards the goal – the conflicts that Protagonist faces and how he over comes them.
Plot point 2 – The final twist which makes Protagonist, after winning over many hurdles, go deeply down in the battle and has to raise again to face, probably the only major conflict/challenge that is left to win over.
Act 3 - The final phase where Protagonist wins over the final conflict/challenge and reaches his goal.
These are one line explanations of the terminology and you can write pages on each one of them but for now let’s focus more on the film LEADER and apply these terms to see how the screenplay writer Sekhar Kammula made the setup and inciting incident very interesting!
Before the film was out, we all know the film is a political drama and Protagonist is a Chief Minister’s son who becomes Chief Minister of the state. The film makers made the publicity to let people know that this film is about - a CM’s son who wants to become a CM. The goal of the Protagonist is out and what the film is about is out, before the film was out, which is the first thing that audience should (must) know before watching the film or else their expectations about the film could be different to what they are going to see in the theatre and could lead to undesired results.
Set up:
Though the goal is out, the director/writer has to show in the film, how Arjun (Protagonist) sets this goal and why he wants to achieve this goal. The reasons generally will be due to some incidents that happen in Protagonist’s life, which are normally revealed either in beginning of the film or as flashback.
Sekhar Kammula used it in setup to make it clear that what happened in Arjun’s life has made him to aspire for becoming a Chief Minister of the state.
The set up here is the first 20 min of the film where we see the current CM, Arjun’s Dad gets shot dead leaving his last word as to make Arjun, the next CM for the state. We also see the antagonist, Arjun’s cousin Dhanunjaya wants to become next CM, and the situations and people around him favoring Dhanunjaya. Here the writer gave the information to the audience about the evil characters, showing that Arjun is trying to enter Lion’s castle.  He also informed audience, what challenges Arjun could face in future and also the initial innocence of Arjun on politics and a sign of not intentioned to become CM.
Inciting incident:
Though Arjun Dad’s last words to Arjun, is to make Arjun as CM, since Arjun was not interested, his Dad’s words didn’t motivate him completely to become CM. Only at later point, the inciting incident happened which made Arjun, a ‘LEADER’.
The inciting incident is the first turning point, where Protagonist turns his journey towards the goal. In LEADER, that comes when Arjun reads his Dad’s dairy where his Dad wishes Arjun to become CM.
Sekhar kammula also elevated this scene very rightly so, by having the song ‘Vandemataram’ here. He scored 10/10 at this point because, the visuals and lyrics of this song are very much connected to the story and to the Protagonist, Arjun. In this song, Arjun observes people’s disastrous life which makes him to take the decision of becoming CM of the state and bring some change in their lives.

Observation:
Introducing various evil characters around in the setup, showing the poverty side of the society and most importantly Arjun’s Dad’s wish, the writer made his Protagonist Arjun to take the decision of becoming CM at the end of the Act -1 (Set-up).
This is how one can make the film look natural, real and get audience believe in the story. Sekhar kammula used not just one reason of his Dad’s wish but he also used the evil characters, the pitiful situations to add more value for Arjun’s decision and succeeded in convincing the audience. This is the first and most impressive point of this film LEADER – the inciting incident.

- Sai Kiran

గుండమ్మ కథ అధ్యాయం - 3 : ఘంటయ్య - అందరి బంధువయ్య

గుండమ్మ కథ... ఒక కుటుంబ సమేతంగా చూడగలిగిన రెండు కుటుంబాల కథా చిత్రం. ఇంకో రకంగా వర్ణించాలంటే అహింసాత్మక చిత్రం కుడా. మరి ఇలాంటి అహింసా మార్గం లో కథ చెప్పాలంటే దానికి ఒక పెద్ద అడ్డంకి ని దాటాలి. అదే ప్రతి-నాయకుడు పాత్ర. ఏ కుటుంబ కథా చిత్రానికైనా ఈ ప్రతినాయకుడి ప్రభావం చాలా ఉంటుంది. ఇక్కడ ఒక సౌలభ్యమో లేకా సంప్రదాయమో మరి, చిత్రం యొక్క తరహా మరియు ప్రతి-నాయకుడి వ్యవహారశైలి ఒకదానిపై ఒకటి ఆధార పడి ఉంటాయి.

అంటే, హాస్య ప్రధానమైన చిత్రానికి అమాయకపు ప్రతి-నాయకుడు, లేదా ప్రతి-నాయకుడు అమాయకుడు అయితే ఆ చిత్రం హాస్య ప్రధానంగా ఉండటం జరుగుతుంది. మిగితా చిత్రాల్లో కథానాయకుడి పైన కూడా చిత్రం యొక్క తరహా ఆధారపడి ఉంటుంది. కాని, కుటుంబ కథా చిత్రానికి ప్రతి-నాయకుడి పాత్రే ఆ తరహా ని ఎక్కువగా నిర్దేశిస్తుంది అని నా అభిప్రాయం.

ఉదాహరణకు, 'ఏప్రిల్ ఒకటి విడుదల' చిత్రం గమనిస్తే హీరో సరదా మనిషే కాని విలన్, మన కృష్ణ భగవాన్ చాలా సీరియస్ పాత్ర. అందుకే చివరి 10-20 నిమిషాల్లో కథ హాస్యానికి దూరంగా, సస్పెన్స్ - సెంటిమెంట్ కి దగ్గరా వెళ్తుంది. ఇంక మన శ్రీను వైట్ల గారి సినిమాల్లో ఇది బాగా గమనిన్చోచు. రెడీ & కింగ్ లో విలన్స్ కాస్త అమాయకులు కనుకే హీరో వాళ్ళతో ఆడుకుంటాడు, హాస్యాన్ని పండిస్తాడు. అదే గుడుంబా శంకర్ లో పవన్ కళ్యాణ్ , ఆట లో సిద్ధార్థ్ చేసారు. విలన్ క్యారెక్టర్ ప్రభావం కథ పైనా హీరో క్యారెక్టర్ పై ఉంటుంది అనే పాయింట్ చెప్పడానికే ఈ ప్రయత్నం.

అదే కుటుంబ కథా చిత్రాల్లో ప్రతి-నాయకుడు హాస్యానికి దూరంగా, దయ-జాలి-కరుణ లేని కర్కోటకుడికి దగ్గరగా ఉంటే, ఇక ఆ కథ, విషాద గాదే.  దీనికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.

రెండు కత్తి మీద సామే. హాస్యం - విషాదం. అందుకే మనం రెండింటిని సగం సగం వాడుకుంటాం. చిత్రం మొదటి భాగం - హాస్యం. రెండో భాగం - విషాదం. చివరిలో హీరో వీరోచితం. ఇలాంటి తరహా లోనే చాలా చిత్రాలు వచ్చాయి.. ఇప్పుడు నాకు ఉదాహరణ కు గుర్తొస్తోంది నువ్వు- నేను. మీకు ఇంకా ఏవైనా అలాంటి తరహా చిత్రాలు గుర్తొస్తే చాలా సంతోషం.

మరో విషయం. ఈ ప్రతి-నాయకుడు సాధారనంగా ఆ కుటంబం లోనే ఉంటాడు. ఆ బంధువే రాబంధై పీక్కుతినాలని ప్రయత్నిస్తుంటాడు.

ఇక మన గుండమ్మ కథ లో ఆ ప్రతి-నాయకుడి పాత్ర చెప్పాలంటే అది రమణారెడ్డి గారి ఘంటయ్య పాత్ర. గుండమ్మ కూతురిని తన కొడుకు కి ఇవ్వాలనేది  అతని లక్ష్యం. అందుకోసం సర్వ శక్తులు - యుక్తులు ధారపోస్తాడు. కాని ప్రతి- నాయకుడు కదా అందుకే సఫలీకృతం కాలేకపోతాడు.

అయితే, ఇక్కడ మన ఘంటయ్య గురించి చెప్పలంటే తను కాస్త జిత్తులు మారి ఎత్తులు వేయగల తెలివైన 'అమాయకుడు'. వివరంగా చెప్పాలంటే, నిజానికి గుండమ్మ కూతురి పెళ్లి వేరే వాళ్ళతో జరగకుండా వాటిని భంగం చేయగల సామర్థ్యం ఉన్న తెలివైన వాడు. కాని ఎప్పుడైతే N.T.R ఆ ఇంట్లో ప్రవేశించి ఆ ఘంటయ్య ఎత్తులను చిత్తు చేయడం మొదలు పెడతాడో అప్పుడు తను చాలా అమాయకుడు అని మనకు అర్థం అవుతుంది. ఇలా అమాయకంగా ఎత్తులు వేస్తూ చిత్తు అవుతుండటం వల్లే మనకు ఘంటయ్య పాత్ర నవ్వులు పుట్టిస్తుంది.

ఒక పాత్ర ని డిఫైన్ చేయడం సులభం కాని అలాంటి పాత్ర కథ లో ఏం చేస్తాడు, ఎలా కథ కి తన ప్రభావం చూపుతాడు అనేది కష్టం ఎందుకంటే దానిమీదే రచయిత విజయం తద్వారా సినిమా విజయం ఆధారపడి ఉంటాయి.
మన ఘంటయ్య నిజానికి విశ్వప్రయత్నాలు చేసాడనే చెప్పాలి. వాటిని ఒకసారి చూస్తే, ఎలా కథా నాయకుడికి అడ్డంకులను సృష్టించవచ్చో తెలుస్తుంది.

ముందు చెప్పినట్టుగా మన ఘంటయ్య, గుండమ్మ కూతురి సంబంధాలు చెడగోట్టడమే ప్రధాన కర్తవ్యం. అది చాల దిగ్విజయంగా చేస్తుంటాడు. గుండమ్మ ని ఇబ్బంది పెడుతుంటాడు. అందులో  తనకు మొదటి ఓటమి ఎదురయ్యేది S.V.R వాల్ల. అందరి దగ్గర చెప్పినట్టే S.V.R దగ్గర కూడా, గుండమ్మ గురించి, జమున గురించి  లేనిపోనివి అన్ని చెప్తాడు ఘంటయ్య. కాని S.V.R  అవేవి పట్టించుకోక ముందుకు వెళ్తాడు (ఎందుకంటే S.V.R  కి ఘంటయ్య గురించి ముందే, గుండమ్మ కూతురి పెళ్లి సంబంధం తెచ్చిన పురోహితుడి ద్వారా తెలుస్తుంది). అది ఘంటయ్య మొదటి ప్రధాన ప్రయత్నం మరియు మొదటి ఓటమి.

రెండో ప్రయత్నం, జమున A.N.R తో తిరగడం గమనించి అది వాళ్ళ పెళ్ళికి దారి తీస్తుందేమో అని గుండమ్మ దగ్గర అవి చెప్పి వాళ్ళిద్దరిని దూరం చేయాలని చూస్తాడు. ఇది రెండో ప్రధానమైన ప్రయత్నం. కాని ఈసారి N.T.R అడ్డుకోవడం వల్ల, తను గుండమ్మ ని ఒప్పించడం వల్ల, ఘంటయ్య ప్రయత్నం వృధా అవుతుంది. ఇది రెండో ఓటమి.

మూడోసారి, S.V.R తనకు గుండమ్మ సంభందం ఇష్టం లేదని, A.N.R జమున వివాహం జరిగితే తను ఆస్తి వాళ్ళకు ఇవ్వనని ఉత్తరం రాస్తాడు. అప్పుడు ఘంటయ్య ఇంకా పెళ్లి జరగదని జరిపించోద్దని గుండమ్మ కి చెప్తాడు. మళ్ళి మన N.T.R తన మాటలతో గుండమ్మ ని ఒప్పించి పెళ్లి కి ఒప్పిస్తాడు - మూడో ఓటమి.

నాలుగు - హరినాథ్-పద్మ పెళ్లి మాటలకి వెళ్ళినప్పుడు కూడా, కట్నం అంటూ అది ఇది అంటూ గుండమ్మ గురించి ఏదేదో చెప్తూ పెళ్లి సంబంధం కుదరకుండా ఉండేలా ప్రయత్నిస్తాడు. ఇది మళ్లి N.T.R భగ్నం చేస్తాడు తన మాటలతో - నాలుగో ఓటమి.

చివరిగా, ఛాయాదేవి గుండమ్మ తో గొడవ పడేటప్పుడు, ఘంటయ్య గుండమ్మ కు సహకరించక ఛాయాదేవి తో  కలుపుతాడు. ఇది ఒక్కటే తన అసలు కోరిక కోసం. పైవి పెళ్లి కోసమే అయినా, ఆ పెళ్లి గుండమ్మ ఆస్తి పొందాలనే కదా. ఇప్పుడు ఆ  ఛాయాదేవి చేతిలో ఉంది. కనుక తను ఛాయాదేవి వైపు వచ్చేసి గుండమ్మ ను కష్టాల్లో తోశాడు.
అయితే సావిత్రి N.T.R క్లైమాక్స్ లో వచ్చి గుండమ్మ ను తమ తో తీసుకెళ్ళి  పోవడం తో అన్ని ముగిసిపోతాయి.

అయితే ఆ క్లైమాక్స్  వచ్చే ముందు ఘంటయ్య కొడుకు రాజనాల  రంగప్రవేశం చేయడం తో ఘంటయ్య మెల్లగా పక్కకు వెళ్ళిపోతాడు. ఇలా తన చెడు ఆలోచనకు తన తెలివి తో ప్రయత్నించినా అవి ఫలించక ప్రేక్షకులను ఫక్కున నవ్వేలా చేసేలా రచించారు  రచయిత. ఇది మన ఘంటయ్య!

- సాయి కిరణ్  

మిస్. మేరి... మిస్సమ్మ...మహానటి... - 3

ఆ స్కూల్ టీచర్ ఉద్యోగం చేయాలని నిర్ణయిన్చున్న తరువాత రోజు, మిస్సమ్మ మళ్లి ఆ పార్క్ కి వస్తుంది. రావు ని కలుస్తుంది. తనకు ఆ ఉద్యోగం తప్పని పరిస్థితుల వల్ల చేయాల్సివస్తోంది అని చెపుతుంది. తను ఒప్పుకున్నందుకు రావు సంతోషిస్తాడు. ఆ సంభాషణలలో మనకు రావు కి మిస్సమ్మ కి ఉన్న తేడాలు కనిపిస్తాయి. రావు కి అన్ని మతాలు ఒక్కటే, అన్నింటినీ ఒకేలా చూస్తాడు కాని మిస్సమ్మ మాత్రం తనకు క్రైస్తవం అంటేనే ఇష్టం అని చెపుతుంది. ఇది మళ్లి తన ఇష్టాల గురించి, అభిప్రాయాల గురించి ప్రేక్షకులకు చెప్పడమే.

మిస్సమ్మ లో సిగ్గు-భయం :
ఇంత దాక మిస్సమ్మ లో కోపం చూసినవారికి ఆమె లో సాధారణ ఆడపిల్లకు ఉన్నట్టు సిగ్గు-భయం  ఉంటాయి అని ఇక్కడ తెలుసుకుంటారు. ఇద్దరు 'భార్య-భర్తల' లా నటించడానికి ఒప్పుకున్నారు. 
డబ్బు అవసరం కోసం ఒకరి భార్య లా నటించడానికి తను ఒప్పుకున్నా, తనొక అమ్మాయి కనుక ఏదో తెలియని భయం మరియు సిగ్గు రెండు తనలో కనిపిస్తాయి. ఇది మొదటిసారి తనలో ప్రేక్షకులు చూస్తారు. ఈ సన్నివేశం తరువాత తను ప్రేక్షకులకి ఇంకా దగ్గరవుతుంది అనే చెప్పాలి.  అదే మిస్సమ్మ మజాకా. తను నవ్వినా, సిగ్గుపడినా, భయపడినా, కోప్పడినా - అది తనకు అందమే... చూస్తున్న ప్రేక్షకులకు ఆనందమే...

అలా ఇద్దరు కలిసి ఒక దరఖాస్తు పంపిస్తారు. అందుకు బదులుగా S.V.R వాళ్ళకి ప్రయాణ ఖర్చులకోసం రూ.100 M.O. కూడా చేస్తారు. (ఎంత మంచి రోజులో!) అలా మన మిస్సమ్మ మిస్సెస్ రావు గా రావు గారి తో కలిసి S.V.R
వాళ్ళ ఊరు వెళుతుంది.  అయితే వాళ్ళు వెళుతూ వెళుతూ తమతో పాటుగా రేలంగి ని కుడా తెసుకువెళతారు, ఇంటి పని చూసుకునే సహాయకుడిగా.

చురక - చిన్న చురక ఏంటంటే, రేలంగి డబ్బులకోసం వేషాలు వేయడం లో ఒకసారి స్వామీజీ వేషం వేస్తాడు. అప్పుడు ఒక పాట పాడుకుంటూ వస్తాడు/ "సీతారాం! సీతారాం! సీతారాం జయ సీతారాం! పైన పటారం లోన లొటారం, ఈ జగమంతా డంబాచారం... సీతారాం! సీతారాం! సీతారాం జయ సీతారాం!" ఈ పాట ముందే ఇలా వాడుకలో ఉందొ లేదో తెలియదు కాని, 'గుడుంబా శంకర్' సినిమా లో పవన్ కళ్యాణ్, స్వామీజీ లా బ్రహ్మానందం దగ్గరికి వచ్చినప్పుడు ఇవే లిరిక్స్ పాడుకుంటూ వస్తాడు. ఇది చూస్తుండగా అది గుర్తొచ్చింది.

మళ్లి మన కథ లోకి వచ్చేద్దాం...

రావు, మిస్సమ్మ, రేలంగి అందరు కలిసి S.V.R  ఊరికి వెళతారు. S.V.R కి మిస్సమ్మ ను చూడగానే తప్పిపోయిన వాళ్ల అమ్మాయి గుర్తువస్తుంది. ఇంటికి తీసుకెళ్ళాక S.V.R భార్య కి కూడా మిస్సమ్మ వాళ్ళ అమ్మాయి లానే అనిపిస్తుంది. ఇంక అక్కడినుంచి ఇద్దరూ మిస్సమ్మ కు అతి మర్యాదలు, అతి ప్రేమ చూపిస్తూ ఉంటారు. వాళ్ల వ్యవహారం మిస్సమ్మ కు నచ్చదు. ఇక ప్రతిసారి వాళ్ళమీద కస్సు- బుస్సులాడుతూ ఉంటుంది.
A.N.R  కు మిస్సమ్మే, S.V.R కూతురు మహాలక్ష్మి ఎందుకు కాకూడదు అనే అనుమానం తో ఉంటాడు. మిస్సమ్మ గురించి, రావు గురించి తెలుసుకోవాలని, రేలంగి దగ్గర విషయాలను ఆరాతీస్తూ ఉంటాడు. ఆవో మజా సన్నివేశాలు.

S.V.R రెండో కూతురు జమున. జమున మనకు సినిమా మొదలైనప్పుడే కనిపించినా ఆ పాత్ర ప్రాధాన్యతంతా కథ రెండో భాగం లో ఎక్కువగా ఉంటుంది. అదేంటో ముందు ముందు చూద్దాం.

ఇక ఒకే ఇంట్లో ఉండే రావు-మిస్సమ్మ ల మధ్య గిల్లి-కజ్జాలు నడుస్తూ ఉంటాయి. ఇవి మజా-మజా సన్నివేశాలు. 

స్కూల్ లో మరో టీచర్, మన అల్లు-రామలింగయ్య. ఈయన వైద్యుడు కూడా. విద్య చెప్పకుండా పిల్లలచే  వైద్యానికి మూలికలు నూరిస్తుండే విద్యా వైద్యుడు. అందుకని అల్లు ని తీస్తాడు S.V.R. అలా రావు అతని స్థానం లో రావడం తో అల్లు కి రావు అంటే పడదు. కాని కమెడియన్ కదా ఏమి చేయలేడు.

ఒకరోజు S.V.R మన రావు ని మిస్సమ్మ ని భోజనానికి పిలుస్తాడు. మన మిస్సమ్మ భోజన అలావాట్లు వేరు. కాని అది S.V.R వాళ్ళు గమనించకుండా రావు ఏదో సర్దిచెప్తూ ఉంటాడు. ఇలా మిస్సమ్మ అలవాట్లు, వ్యవహారశైలి, అభిప్రాయాలు ఏమాత్రం అనుమానించేలా ఉన్నా మన రావు వాటిని సర్దేస్తూఉంటాడు. అదే ఆయన పని.  ఇక ఆ భోజనం తరువాత, జమున నాట్యప్రదర్శన జరుగుతుంది. అందరికి అది నచ్చుతుంది. మన మిస్సమ్మ నిక్కచ్చి కనుక, నాట్యం బాగుంది కాని పాట బాలేదు, కావాలంటే నాదగ్గరకు రా పాట నేర్పిస్తాను అంటుంది.
మరుసటి రోజు జమున రావు ఇంటికి వస్తుంది. తను చాలా అమాయకురాలు. మిస్సమ్మ చాలా గడుసు. రావు సున్నితమనస్కులు. ఇక ఈ ముగ్గురి మధ్య జరిగే సన్నివేశాలు సినిమా రెండో భాగం లో హైలైట్స్.
అలా జమున కు మిస్సమ్మ నేర్పించే పాట,

"తెలుసుకొనవె చెల్లి.. అలా నడుచుకొనవె చెల్లీ...
మగవారికి దూరముగా మగువలెపుడు మెలగాలని...
తెలుసుకొనవె చెల్లి.. అలా నడుచుకొనవె చెల్లీ...

మనకు మనమే వారి కడకు పని ఉన్నా పోరాడని...
అలుసుచేసి నలుగురిలో చులకనగా చుసేదారని
తెలుసుకొనవె చెల్లి.. అలా నడుచుకొనవె చెల్లీ...

పది మాటలకు ఒక మాటయు బదులు చెప్పకూడదని
లేనిపోని అర్థాలను మనవెనుకనే చాటెదరని... 
తెలుసుకొనవె చెల్లి.. అలా నడుచుకొనవె చెల్లీ... "

ఈ పాట ద్వారా మనకు మిస్సమ్మ ఆలోచనలు, ఒక అమ్మాయి గా అబ్బాయిల పైన ఉన్న అభిప్రాయాలు
తెలుస్తాయి. ఇందుకు బదులుగా మన రావు పాట పాడుతాడు. అది,

"తెలుసుకొనవె యువతీ.. అలా నదుచుకొనవె యువతీ...
యువకుల శాసించుటకే, యువతులవతరించారని...
తెలుసుకొనవె యువతీ.. అలా నడుచుకొనవె యువతీ...

సాధింపులు బెదరింపులు ముడితలకిక కూడదని...
హృదయమిచ్చి పుచ్చుకునే చదువేదో నేర్పాలని...
తెలుసుకొనవె యువతీ.. అలా నడుచుకొనవె యువతీ...

మూతిబిగింపులు అలకలు పాతపడిన విద్యలని...
మగువలేపుడు మగవారిని చిరునవ్వులో గెలవాలని...
తెలుసుకొనవె యువతీ.. అలా నడుచుకొనవె యువతీ..."

(అప్పుడు రావు చెప్పిన మాటలు...కనీసం ఇప్పుడన్నా అమ్మాయిలు అలావాటు చేసుకుంటే ఎంత బాగుండు...)

ఈ సీక్వెన్సు లో, N.T.R. మరియు సావిత్రి వారికి వారే సాటి అని అనిపించుకున్నారు, ముఖ్యంగా మిస్సమ్మ. తను పాడుతునప్పుడు అభినయం కాని, N.T.R తనని కవ్విస్తూ పాడుతున్నప్పుడు కళ్ళలో కోపావేశం పలికించడం కాని ఒక్క మిస్సమ్మ... మహానటి సావిత్రి కే చెల్లింది.

- సాయి కిరణ్  

మిస్. మేరి... మిస్సమ్మ...మహానటి... - 1

మిస్సమ్మ - ఇది పరిచయం అక్కర్లేని పేరు. ఒక మహానటి యొక్క నటనా ప్రావిణ్యాన్ని మరోసారి ఆవిష్కరించిన చిత్రం. ఆ మహానటి ని తెలుగు సినీ అభిమానుల గుండెల్లో చిరస్థాయి గా నిలిచిపోయేలా చేసిన చిత్రాల్లో ఇది మొదటిది అనడం లో అతిశయోక్తి లేదు. మరి అలాంటి మహానటి నటించిన ఈ మిస్సమ్మ విశేషాలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి అనేది కాస్త తొంగిచూద్దాం రండి.

గొప్పగా ఆలోచించడం, ఆ ఆలోచనలు కాగితం మీద అంతే గొప్పగా పెట్టడం లో రచయిత యొక్క ప్రతిభ తెలుస్తుంది. కాని అలా కాగితం మీద పెట్టిన దాన్ని తెర మీదకు అంతే గొప్పగా తీసుకురావాల్సిన భాద్యత దర్శకుడి ది మరియు నటీ-నటులది. అయితే నటనా ప్రధానమైన చిత్రాల్లో దర్శకుడి సగం భాద్యత, నటీ-నటుల ఎంపిక దగ్గరే తీరుతుంది.  ఆ తరువాత అసలు భాద్యత అంతా ఆ నటులదే. వారి నటనే చిత్రానికి, వారికి మంచి పేరు తెచ్చిపెట్టేది అనడం లో ఏ సందేహమూ లేదు.

అలా  మహానటి ఎంపిక తో దర్శకుడు సగభారం తీర్చుకోగా, తన నటన తో అందరిని జయించేసి, ఈ 'మిస్సమ్మ' కు మన 'మిస్సమ్మ' మహానటి సావిత్రి గారే  ప్రధాన ఆభరణంగా నిలిచారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ కథ నడిచేదే మిస్సమ్మ చుట్టూ. తన జీవితపు సంఘటనలే కదా సినిమా అంతా. అందుకే కదా సినిమా పేరు కూడా 'మిస్సమ్మ' అయింది. కనుక అలాంటి మిస్సమ్మ ను, మిస్సమ్మ కథ ను వేరు చేసి చూడలేము.  'మిస్సమ్మ' తో పాటుగానే మిస్సమ్మ కథ గురించి కూడా చూద్దాం...

కథాపరంగా, మిస్సమ్మ అసలుగా మహాలక్ష్మి. S.V.R దంపతుల పెద్దమ్మాయి. నాలుగేళ్ల వయస్సు లో కాకినాడ లో తప్పిపోయింటుంది. ఆ కుటుంబానికి దూరమైనా వారు మాత్రం తమ మహాలక్ష్మి ఎప్పటికైనా దక్కుతుందనే ఆశ తో బ్రతుకుతుంటారు. వారి మేనల్లుడు A.N.R, డిటెక్టివ్ అని చెప్పుకుంటూ, తప్పిపోయిన బర్రెలను, దూడలను వెతికిపట్టుకుంటూ హాస్యాన్ని పండిస్తుంటాడు.

అయితే S.V.R కి ఒక స్కూల్ ఉంటుంది. అందులో అధ్యాపకులు గా అల్లు రామలింగయ్య, A.N.R లు ఉంటారు. A.N.R తను హెడ్-మాస్టర్ అని చెప్పుకుంటూ ఉంటాడు. అది వేరే విషయం. మన అల్లు, వైద్యుడు కూడా(గుర్తుపెట్టుకోండి). కాని ఇద్దరు అప్రయోజక అధ్యాపకులు. ఇది గమనించి S.V.R, ఇద్దరు  కొత్త పంతుల్ల కోసం A.N.R ని ప్రకటన వేయిన్చమంటాడు. అప్పుడు మన A.N.R అతితెలివితో వారు దంపతులైతే మంచిది అని సలహా ఇస్తాడు. S.V.R కూడా సరే అంటాడు. అలా  'B.A. పాస్ అయిన జంట కు ఉద్యోగం' అనే ప్రకటన వెలువడుతుంది.

అయితే, తప్పిపోయిన వాళ్ళ అమ్మాయి మహాలక్ష్మి గురించి A.N.R దగ్గర  చెప్తూ, పులిగోరు- కుడికాలి మీద పుట్టుమచ్చ అని రెండు గుర్తులు చెప్తుంది మహాలక్ష్మి అమ్మ. ఇవి చాలు ఎలాగైనా పట్టుకుంటాను అంటాడు A.N.R. ఆ వెంటనే మనకు సంగీత పాఠాలు చెప్తూ, మిస్సమ్మ కనిపిస్తుంది. తన కుడి కాలి పై పుట్టుమచ్చ ని కూడా చూపించి దర్శకుడు మహాలక్ష్మి ఎవరు అనే సస్పెన్స్ కి, చిత్రం మొదటి 15 నిమిషాల్లోనే తెర దించేసాడు. అయితే మిస్సమ్మె మహాలక్ష్మి అని వాళ్ళు ఎలా తెలుసుకుంటారు, A.N.R నిజంగానే కనుక్కోగలుగుతారా అనేదే మిగిలిన కథ.
అయితే, తను సంగీత పాఠాలు చెప్తున్న అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ఇంకో ఉరికి ట్రన్స్ఫెర్ అవ్వడం తో తన ఉద్యోగం పోతుంది. కాని ఆయన ఇంకో చోట ఉద్యోగం కోసం మిస్సమ్మ కి తన సిఫార్సు ఉత్తరం ఇస్తాడు. అది తీసుకుని మిస్సమ్మ వెళ్తుండగా రావు (N.T.R) ఎదురవుతాడు. తను ఆ ఇంట్లో అబ్బాయికి ప్రైవేటు చెప్తుంటాడు. తనకి కూడా ఆ ఆఫీసర్ సిఫార్సు ఉత్తరం ఇస్తాడు. అనుకోకుండా మిస్సమ్మ మరియు రావు ఒకే చోట ఇంటర్వ్యూ కి వస్తారు. కాని అక్కడ ఇద్దరికీ ఉద్యోగం దొరకదు. తిరిగి వెళ్ళిపోతారు.

మిస్సమ్మ కోపం:
----------------
మిస్సమ్మ లో కోపాన్ని మొదటిసారిగా చూసేది ఆ ఇంటర్వ్యూ లోనే. అక్కడ ఇంటర్వ్యూ చేసే గుమ్మడి, ఉద్యోగం కాకుండా ఉచిత సలహా ఇవ్వడం తో మిస్సమ్మ కోపానికి బలవుతాడు. అప్పుడే మనకు మిస్సమ్మ కోపం ఒక మెరుపు లా కనిపిస్తుంది.

మిస్సమ్మ తల్లి-దండ్రులు వృద్ధులు. వారు డేవిడ్(రమణారెడ్డి) దగ్గర అప్పు చేసింటారు. రోజు డేవిడ్ అప్పు కోసం వస్తుంటాడు. తనకి మిస్సమ్మ ని పెళ్లి చేసుకోవాలనే ఆశ. ఆకారణంగా వస్తుంటాడు. అప్పు తీర్చండి లేదా మిస్సమ్మ ని ఇచ్చి పెళ్లి చేయండి అని బలవంతపెడుతుంటాడు. డేవిడ్ కూడా మిస్సమ్మ కోపానికి బాదితుడవుతాడు.

మిస్సమ్మ కోపం - అసహనం - అఇష్టం:
---------------------------------------
ఇక్కడ ఆ డేవిడ్, అప్పు తీర్చండి లేదా మిస్సమ్మ ని ఇచ్చి పెళ్లి చేయండి అని గొడవ చేస్తుంటే, మిస్సమ్మ కోపం తో అసహనం తో వాడ్ని ఎడా-పెడా తిట్టి తరిమేస్తుంది. ఆ వెంటనే, వాళ్ళ నాన్న తో , తన దగ్గరున్న బంగారు ఆభరణం అమ్మేసి డేవిడ్ అప్పు తీర్చేద్దాం అంటుంది. ఆ ఆభరణం పైన హిందూ దేవతల బొమ్మలు ఉంటాయి. వాళ్ళు మాత్రం, తమకు అది కలిసోచ్చినది అని అంటారు. అప్పుడు మిస్సమ్మ, "క్రైస్తవ నగల మీద హిందూ దేవుళ్ళ బొమ్మలేంటి, పిచ్చి దేవుళ్ళు, పిచ్చి మతం" అని తనకున్న అఇష్టత ని చూపిస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న, అది తప్పు, అన్ని మతాలూ ఒక్కటే అని చెప్తాడు.  కాని మిస్సమ్మ మాత్రం ఆ మాటలను తేలికగా తీసుకుంటుంది ఎందుకంటే తనకు క్రైస్తవ మతమంటేనే ఇష్టం.

ఈ సన్నివేశం తనకు హిందూ మతం మీద అఇష్టత, క్రైస్తవ మతం మీద ఇష్టాన్ని చూపుతాయి (ఇది మిస్సమ్మ పాత్ర యోక్క అభిరుచి మాత్రమే అని గమనించాలి) ఈ సన్నివేశం, తరువాత రాబోవు కథ రెండో భాగానికి పునాది మెట్టులాంటిది. ఎందుకంటే, కథ రెండో భాగం లో తనకు  S.V.R ఇంట్లో హిందూ సంప్రదాయ పద్దతుల్లో మర్యాదలు చేసినప్పుడు, ఆ అఇష్టత, ఆ అసహనం, ఆ కోపం అన్ని బయటపడతాయి. అలా అక్కడ అవి కనపడాలంటే వాటిని ముందే ప్రేక్షకులకు తెలియజేయడానికే ఈ సన్నివేశం లో ఈ సంభాషణలు రాసివుండొచ్చు అని నా అభిప్రాయం.

ఇక్కడ ఒకటి గమనిస్తే, S.V.R కుటుంబం ఎక్కడో ఉంది... మిస్సమ్మ ఎక్కడో మేరి గా ఉంది. మరి ఇద్దరూ ఎలా కలుస్తారు, మధ్యలో N.T.R పాత్రెంత? A.N.R, జమున ల అవసరము ఎంత? త్వరలోతెలుసుకుందాం.

- సాయి కిరణ్  

మిస్. మేరి... మిస్సమ్మ...మహానటి... - 2

అలా మిస్సమ్మ, రావు తమ ఇంటర్వ్యూలు పోగొట్టుకున్న తరువాత మనకు రేలంగి పాత్ర పరిచయం అవుతుంది. తను వేషాలు వేసుకుంటూ, జనాన్ని బురిడి కొట్టిస్తూ,  'అడుక్కుంటూ' డబ్బు సంపాదిస్తుంటాడు. మన రావు కి ఇల్లు-వాకిలి లేదు. 'నా' అనే వారు లేరు. ఒక పార్కె అతని రాజభవనం. అక్కడ ఉండగా రేలంగి పరిచయం అవుతుంది. అప్పుడు రావు పేపర్ లో ఒక ఉద్యోగ ప్రకటన చూస్తాడు. అది B.A పాస్ అయిన 'దంపతుల' కు అని ఉంటుంది. తను ఇంకా బ్రహ్మచారి B.A కనుక ఆశలు వదులుకుంటాడు. అదే పార్క్ కి మిస్సమ్మ కూడా వస్తుంది. రావు మిస్సమ్మ కి ముందు జరిగిన ఇంటర్వ్యూ దగ్గర పరిచయం వల్ల ఒకరిని ఒకరు గుర్తుపడతారు. ఆ ప్రకటన గురించి మిస్సమ్మ కి చెప్పగా, తనకు పెళ్లి కాలేదని మిస్సమ్మ చెపుతుంది.

మిస్సమ్మ కోపం:
ఉచిత సలహాలంటే తనకెంత కోపం అనేది మళ్లి ఇక్కడ తెలుస్తుంది మనకి. అలా తనకి పెళ్లి కాలేదనగానే, వెంటనే రావు ఒక ఉచిత సలహా ఇస్తాడు, ఎవరైనా B.A పాస్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకొని ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోమని. ఇందులో కొంటెతనం లేదండోయ్. పాపం రావు మంచివాడు. కాని ఆ మాటలకు మిస్సమ్మ కు వెంటనే కోపం వస్తుంది. వెంటనే 'థాంక్స్' అని కోపంగా అనేసి అక్కడినించి వెళ్ళిపోతుంది. తన కోపం అంతా రావు కళ్ళల్లో భయంగా మనకు కనిపిస్తుంది. 

నిజానికి, ఆత్మాభిమానం (ఇగో కూడా) ఎక్కువ ఉన్నవారు అంత సులువు గా పక్కవారి సలహాలను స్వీకరించారు.

అలా వెళ్ళిపోయిన మిస్సమ్మ ను మన డేవిడ్ మళ్లి తగులుకుంటాడు. తనను పెళ్లి చేసుకో అని మళ్లి బలవంతపెడతాడు. ఆ మధ్య లో రేలంగి అడ్డువచ్చి కాస్త నవ్వులు పండించినా, డేవిడ్ మిస్సమ్మ ని వదలడు. చివరికి మిస్సమ్మ మళ్లి తిరిగి రావు దగ్గరికి వస్తుంది. రావు కాస్త కలగచేసుకొని
డేవిడ్ కి ఏదో  సర్దిచెప్పి, మిస్సమ్మ రెండు మాసాల్లో అప్పు తీర్చేస్తుంది అని చెప్పించి, ఒప్పించి, పంపించేస్తాడు.

డేవిడ్ వెళ్ళిపోయాక, మిస్సమ్మ తో రావు మళ్లీ ఒక ఐడియా చెబుతాడు. ఇద్దరికీ డబ్బు అవసరం ఉంది కనుక, ఇద్దరమూ భార్య-భర్తలు గా నాటకమాడి, ఆ రెండు మాసాలు ఆ స్కూల్ టీచర్స్ గా ఉద్యోగం లో చేరితే, ఇద్దరి కష్టాలు తెరుతాయి కదా అని అంటాడు.

మిస్సమ్మ కోపం:
మన మిస్సమ్మ కు మాములుగానే కోపం క్షణాల్లో వచేస్తుంది. రావు ఇలా అనగానే వెనువెంటనే అతని మీద అరిచేస్తుంది. ఇందులో రావు డి ఏదో దుర్బుద్ధి ఉందంటూ,  తనకు నచ్చలేదని అక్కడినుంచి వెళ్ళిపోతుంది.

కోపం తో వెళ్లిపోయి దూరంగా కూర్చుంటుంది. ఇదంతా గమనిస్తున్న రేలంగి, రావు దగ్గరికి వచ్చి ఈ ఐడియా పారేటట్టు లేదు అంటాడు. అప్పుడు మన రావు, ఆడవారు అవునంటే కాదన్నట్టు కాదంటే అవునన్నట్టు, ఖచితంగా రేపు తను ఒప్పుకుంటుంది చూడు అంటాడు.

అప్పుడే మనకు బాగా నచ్చిన పాట,
" అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే.. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే.. అర్థాలే వేరులే...అర్థాలె వేరులే "
ఇదంతా దూరం నుంచి వింటూ మిస్సమ్మ నవ్వుకుని వెళ్ళిపోతుంది.
మిస్సమ్మ ఇంట్లో వాళ్ళ నాన్న, ఆ  డేవిడ్ పెడుతున్న ఇబ్బందులకు బాధపడుతుండగా, తను అప్పు తీర్చేస్తాను, స్కూల్ టీచర్ ఉద్యోగ ప్రకటన చూసాను. ఆ జీతం తో రెండు మాసాల్లో అప్పు తీర్చేయచ్చు అని మిస్సమ్మ  వారికి చెప్తుంది. (రావు చెప్పినట్టు - కాదంటే అవుననిలే).  తను పడుకునేముందు ఏసుక్రీస్తు కి ప్రార్థన చేసి పడుకుంటుంది.

ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం -  Character Motivation

Character Motivation -  మిస్సమ్మే S.V.R కూతురు అని ప్రేక్షకులకి తెలుసు. కాని పాత్రలకే  తెలియదు. అది  A.N.R కనిపెట్టాలి. కాని A.N.R బయటకి వచ్చి సిటీ అంతా లేక రాష్ట్రమంతా గాలించడం సాధ్యం కాదు. మిస్సమ్మే అక్కడికి వెళ్ళాలి. అప్పుడే అది సులువు అవుతుంది / సాధ్యమవుతుంది. మరి ఎందుకు మిస్సమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి? కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు జవాబు గా,  S.V.R  వాళ్లకి 'స్కూల్' ఇచ్చారు. అందులో అధ్యాపకుల కొరత పెట్టారు. వాటికోసం ప్రకటన వేసారు, మిస్సమ్మ వచ్చేలా చేసారు, మన రచయిత. ఇది ఒక పక్క.
మరో పక్క, మిస్సమ్మ రావడానికి తనకు కూడా కారణం కావాలి కదా! అందుకే డేవిడ్ పాత్ర ను పెట్టారు. డేవిడ్ చేత అస్తమానూ అప్పు తీర్చండి, లేదా పెళ్లి చేయండి అని బలవంతపెట్టించి, పెళ్లి ఇష్టం లేదు కనుక అప్పు ఎలాగైనా తీర్చాలి అని మిస్సమ్మ అనుకునేలా చేయించి, ఈ ఉద్యోగానికి మిస్సమ్మ సిద్దపడేలా ఇబ్బందులను సృష్టించారు రచయిత.

ఇక తను ఒక్కత్తే వెళితే ఎం బాగుంటుంది నా మొహం. అందుకే రావు పాత్ర ని పెట్టారు. మరి ఇద్దరూ అక్కడికి వెళ్ళాక కథ రసవతరంగా సాగాలి కదా అందుకే, 'దంపతులకు మాత్రమే' అని S.V.R వారిచేత కండిషన్ పెట్టించి, దానికి తగ్గట్టుగా వీళ్ళిద్దరి చేతా నాటకం ఆడించేలా చేసారు రచయిత.

ఇదంతా SET-UP. కథయొక్క ముఖ్యభాగం జరగడానికి - మిస్సమ్మే S.V.R కూతురు అని తెలుసుకోవడం కోసం - చోటుచేసుకున్న సంఘటనలు. కురుక్షేత్రం జరగడానికి ముందు ధర్మరాజు జూదం ఆడినట్టుగా...  కాని దీని అర్థం ఇంతసేపు కథ లేదని కాదు. కథయొక్క  మొదటి దశ అనొచ్చు. ఈ మొదటి దశలో అసలు సమస్య ఏంటి, ఇందులో పాత్రలు ఎవరెవరు, వారి స్వభావాలేంటి  అనే విషయాలు తెలుస్తాయి. ఏమంటే పాత్రల స్వభావాలు కాస్త ఎక్కువగా తెలుస్తున్నాయ్. ముఖ్యంగా మిస్సమ్మ స్వభావం.

ఇక తదుపరి, మన రావు గారి స్వభావం గురించి, ఆయనకీ మిస్సమ్మ కి ఉన్న స్వభావాల తేడాల గురించి తెలుసుకుందాం... అలాగే కథ లో ముందుకు వెళదాం...!

- శ్రీధీష